Thursday, December 16, 2010

Tejaswi..

చాలా రోజులు అయింది బ్లాగ్ ముఖం చూసి, అది నన్ను రెండు తిట్లు తిట్టింది ఏంటి ఇన్ని రోజులకి గుర్తు వచ్చానా అని  .. లేదులేవె అని బుజ్జగించి టపా రాద్దామని మొదలెట్టా.
నిన్న నేను ఏదో browse  చేస్తూ accidental గ ఒక బ్లాగ్ కెల్లా Indianhomemaker గారిది.  తన పోస్ట్స్ చాలా బాగున్నాయి. చాలా వరకు women  issues గురుంచి  అనిపించింది.
కానీ ఇప్పుడు నేను చెప్పేది వాటి గురుంచి కాదు, తన కూతురు తేజస్వి గురుంచి..
తేజస్వి పంతొమ్మిది సంవచ్చారాల వయస్సుగల అందమైన, చాలా ధైర్యం, తెలివితేటలు గల ఒక ambitious  గర్ల్.
చూస్తున్నారు కదా పక్కన పిక్చర్ లో... ఎంత బాగుంది కదా..
 
 తేజస్వి బ్లాగ్ లో letter to the future  అని తన future  daughter  కి రాసిన లెటర్ లో తను ఎప్పడికైన ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకోవాలని ఆ అమ్మాయిని ఎలా పెంచాలని తన కలల్ని కోరికల్ని చాలా స్పష్టంగా రాసింది. 
కానీ దురదృష్టక అయిన విషయం ఏమిటంటే తను dengue  fever  తో ఈ year  ఆగష్టు లో చనిపోయింది..నేను తేజస్వి బ్లాగ్ అండ్ వాళ్ళ మదర్ indianhomemaker  బ్లాగ్స్ చదువుతున్నప్పుడు నా కళ్ళనిండా నీళ్ళు..
ఇండియన్ హోం మకెర్ గారు తన కూతుర్ని పోగొట్టుకున్నా ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతున్నారు.. మీరు ఈ కింద లింక్స్ లో చూడవచ్చు
తేజస్వి లింక్ http://indianhomemaker.wordpress.com/tejaswee-rao/
 
తేజస్వి ఒక సంవస్తరం ముందు ఒక పోస్ట్ లో తను చాలా కలం జీవించాలని ఈ ప్రపంచలం చాలా పెద్దది తను అంత చూడాలి అన్ని experience  అవ్వాలి అని రాసుకుంది.. 
ఏంటో ఆ భగవంతుడి లీలలు.. !!!
 
-Sahithi
 

Wednesday, September 1, 2010

సాఫ్ట్వేర్ ఇంజనీర్

అదేనండి మరి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని . మీకు ఈ పాటికి అర్థం అయింటుంది నేను దేని గురుంచి రాస్తున్నానో !
ఈ బ్లాగ్స్ రాసేవాల్లల్లో చాలా మంది software engineers అని అనుకుంటాను.. చెప్పండి ఎంత మంది మీరు చేసే జాబు తో satisfied గ ఉన్నారో ?
ఎవర్ని కదిలించినా జావా, ఒరాకిల్ , .నెట్ ఇదే గోల . వేరే ప్రపంచమే లేకుండా పోతుంది. ఎంచక్కా ఏ లా నో లేక సివిల్ సర్వీసు లేక ఏ డాక్టరో -) ( నాకు తెలుసండి అది అంత ఈజీ గాదని) .
అయింటే ఎంత బాగుండును. మా ఇంట్లో మరియు మాకు తెలిసిన వాళ్ళు అందరు ఈ బోరింగ్ ఫీల్డ్. మాట్లాడడానికి వేరే టాపిక్ ఏ ఉండదు ఎవరితోనూ.
నాకు తెలిసి ప్రపంచమే కంప్యూటర్ , కంప్యూటర్ ఏ ప్రపంచం ..
ఎంచక్కా దిరిసెన పుష్పాలు శిరీష గారి లాగా లేక సత్యవతి గారి లాగా ఏదైనా సోషల్ సర్వీసు చేద్దామని ఉంది ... ఏంటో ఎప్పుడు బయటపడతనో ఈ సాఫ్ట్వేర్ నుండి .

Tuesday, August 31, 2010

లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చేసా

హలో హలో ఎలా ఉన్నారు అండి అందరు ?? నేను కూడా ఈ బ్లాగ్ ప్రపంచం లోకి ఎంటర్ అయ్యే టైం వచ్చింది. మిమ్మల్ని మీ బ్లాగ్స్ ని చూస్తుంటే నాకు కుళ్ళు పుడుతుంది.
అందరు ఎంత చక్కగా రాస్తున్నారు మంచి ప్రొఫెషనల్ writers లాగా సూపర్ !! నేను కూడా కొంచెం ప్రయత్నం చేస్తాను. మీరు అందరు నాకు కొంచెం హెల్ప్ చేయాలి ...

సరే నండి next టపా ఏమి వ్రాయాలో కొంచెం ఆలోచిస్తాను మరి... You all take care and have a wonderful day.


సాహితి